PPM: జిల్లాలో పశువుల అక్రమరవాణాపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్. మన్మధరావు పేర్కొన్నారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు అమ్మకంపై ఎటువంటి ఫిర్యాదుగానీ, సమాచారం గానీ తన దృష్టికి రాలేదన్నారు. ఒకవేళ వస్తే సంబంధిత అధికారులతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.