KDP: ఖాజీపేట మండలంలో మార్చి 11వ తేదీన జరగనున్న మాదిగల ఆత్మగౌరవ నిరసన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. మండలంలోని ప్రతి మాదిగపల్లె నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.