ADB: ఇంటర్ ఫలితాల విడుదల నేపథ్యంలో, మే 13 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గణేశ్ తెలిపారు. ఫెయిలైన, ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు ఏప్రిల్ 13 నుంచి 24 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. ఇదే గడువులోగా రీవెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.