SRPT: భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిమట్టి పెళ్లి సైదులు ఆరోపించారు. బుధవారం నాగారంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సభ్యత్వ నమోదు నిర్వహించారు.