MHBD: గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారు నెలవంచలోని చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు నీట మునిగి మృతి చెందారు. మృతులు కత్తుల శిరీష (9), చైత్ర (9)గా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.