NRML: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, బోధన విధానాన్ని పరిశీలించారు. సంక్షేమ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.