VKB: కొడంగల్‌లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులచే రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రాణం ఎంతో విలువైనదని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సూచించారు. నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించగలమని తెలిపారు.