సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14 వార్డు మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, వార్డు ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.