MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో వృధాగా ఉన్న క్రీడా ప్రాంగణాన్ని సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి బాగు చేయించారు. గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయగా పిచ్చి మొక్కలతో, చెత్తాచెదారంతో నిండిపోయింది. సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకొని డోజర్ సహాయంతో క్రీడా ప్రాంగణము బాగు చేశారు. యువకులు ఉపయోగించుకొని మంచి క్రీడాకారులుగా తయారు కావాలని సూచించారు.