TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారణాసి పర్యటనకు బయలుదేరారు. ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో కాశీ విశ్వనాథుడిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పార్టీ స్థాపనకు ముందు దైవాశీస్సులు తీసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. కాశీ పర్యటన ముగించుకుని ఆమె ఇవాళ సాయంత్రమే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.