HYD: ఫిలింనగర్ కాలనీలోని పలు విధుల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన సమస్యలపై సమరం కార్యక్రమాన్ని ఫిలింనగర్ కాలనీవాసులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా పార్కులను పట్టించుకోవడంలేదని, విధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.