TG: అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈనెల 18 నుంచి మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో యాత్రికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి తెలిపారు.