TG: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మహిళాలోకం సంతోషంగా ఉందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఏ ప్రాంతానికి BJP అన్యాయం చేయదని, కొందరు కావాలనే డీలిమిటేషన్‌పై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. BJPతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని, విపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.