JN: బచ్చన్నపేట మండలం గోపాలనగర్లో గత ఏడేళ్ళల్లో గ్రామానికి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల గురించి వివరాలు ఇవ్వాలని స్థానికుడైన సిరిపాటి ఐలయ్య కోరారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా GP కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చారు. అభివృద్ధి పనులు, ఉపాధిహామీ పథకం, ఇండ్ల లబ్దిదారులు, సమావేశాలు, భూమి అనుమతులు, మిగతా కార్యక్రమాలు, జరిగిన అభివృద్ధి వివరాలు తెలపాలన్నారు.