SRPT: ఇంటర్ ఫలితాలు విడుదలైన మూడు రోజుల్లోనే సూర్యాపేట జిల్లాలో విద్యా వ్యాపారం ఊపందుకుంది. టాపర్ల ఫోటోలతో విద్యా సంస్థలు ప్రకటనల హోరు మొదలుపెట్టాయి. ఉచిత సీట్లు, ఫీజు రాయితీలను ఎరగా వేస్తూ ప్రైవేట్ కళాశాలలు ప్రచారానికి దిగాయి. మరోవైపు, ప్రతినిధులు నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు.