HNK: కాకతీయ విశ్వవిద్యాలయం ఫార్మ్-డీ ఐదో సంవత్సరం, పీజీ రెండో సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్‌ను వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఇటీవల విడుదల చేసింది. ఏప్రిల్- 2026కు సంబంధించిన రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23, 25, 27 తేదీల్లో మ. 2 గంటల నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.