ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామంలో అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గ్రామంలోని రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి, కంకర తేలి ఉండటంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు, పాదచారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.