KMM: బోనకల్ మండల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతరాలు లేని ఆదర్శ సమాజం విద్య ద్వారానే సాధ్యం అవుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాలు ప్రారంభిస్తామన్నారు.