ADB: లంబాడి హక్కుల పోరాట సమితి నార్నూర్ మండలాధ్యక్షుడిగా జాదవ్ కైలాష్ బుధవారం నియామకమయ్యారు. ఈ సందర్బంగా LHPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. లంబాడీ-బంజారా సమాజాభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం, లంబాడీల హక్కుల సాధన కోసం కృషి చేయాలనీ పేర్కొన్నారు. దీంతో పలువురు కైలాష్ను అభినందించారు.