SRPT: ఒకవైపు పోలీసులు ప్రమాదాల నివారణకు కృషి చేస్తుంటే, మరోవైపు కొందరి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. సూర్యాపేట ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, మట్టి కుప్పలను రోడ్డుపైనే వదిలి వేశారు. సామాన్యుల పార్కింగ్‌పై జరిమానాలు విధించే అధికారులు, ప్రమాదాలకు ‘వెల్కమ్’ చెబుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.