HYD: సైబరాబాద్లో చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. దోమల నివారణ, నీటి వనరుల పరిరక్షణే లక్ష్యంగా 11 చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రస్తుతం మీదికుంట, గోపి చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించి, నీటి ప్రవాహాన్ని మెరుగుపరుస్తున్నారు. చెరువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.