NGKL: నల్లకుంట కాలనీలో కోతుల బెడద రోజురోజుకీ అధికమవుతోంది. కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులను చెల్లాచెదురు చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలపై దాడి చేసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని కోతులను తరలించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.