NRPT: నర్వ మండలం ఎల్లంపల్లిలో లక్ష్మమ్మ భగవంతుకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ నాయకులు ప్రారంభించి అందజేశారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ గృహ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.