NRPT: మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కోల్పూర్ గ్రామంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. BSSS సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి గౌడ్, సలహాదారు హెచ్.కె. హుసేనప్ప ఆధ్వర్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని సర్పంచ్ ముద్దు రాములు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని అభినందించారు.