HNK: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా కాజీపేట ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలో ఉన్న కానిస్టేబుళ్లు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.