MDK: కౌడిపల్లి మండలం రాయలపూర్ అడవి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి అడవిలో మంటలు రావడంతో వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ బ్రోయర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే సమాచారం ఇవ్వాలన్నారు.