SGR: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు కోహీర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జడ్పీహెచ్ఎస్ దిగ్వాల్, విశ్వ భారతి హైస్కూల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 598 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.