SRD : హత్నూర మండలం నవాబుపేటకు చెందిన లక్ష్మణ్ మంగళవారం రాత్రి దల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.