KNR: దళితులపై అణచివేత ఘటనలను నివారించేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సమావేశాలను మూడు నెలలకోసారి నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగరంలోని కోర్టు సమీపంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి సభలో ఆమె మాట్లాడారు. దళితుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.