KMR: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 13,143 మంది విద్యార్థులకు గాను 13,110 (99.75%) మంది హాజరుకాగా, 33 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈవో రాజు స్పష్టం చేశారు.