WGL: ఏప్రిల్ 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలో జాగృతి నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.