ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చెంచుఘాట్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి గుస్సాడీ వేషదరణ వేసి వారితో మమేకమై గడిపారు. అనంతరం నిర్వహించిన సహపంతి భోజనంలో పాల్గొని ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకున్నారు. ఆదివాసీ యువత విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.