BDK: కరకగూడెం మండలంలోని గ్రామీణ బ్యాంకు సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు బైకును ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు 108 ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.