మెదక్ జిల్లా వరిగుంతం గ్రామంలో బుర్ర సంతోష్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాన్ని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ పరిశీలించి, ఇది ఎఱయప్రోలు పేరు మీద ఇచ్చిన దానం గురించి తెలుపుతుందని నిర్ధారించారు. గ్రామం యొక్క పురాతన చరిత్రకు నిదర్శనమైన ఇటువంటి శాసనాలను, విగ్రహాలను భావి తరాల కోసం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలన్నారు.