SDPT: కోహెడ మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు విద్యార్థులకు నిర్వహించారు. విజేతలకు సామాజిక కార్యకర్త డా. వేల్పుల శంకర్ బహుమతులు అందజేశారు. అంబేద్కర్ ఆశయాలు సమానత్వానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వలస సుభాష్ చంద్రబోస్, ఎలసాని దర్గా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.