NGKL: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం ఉత్సవ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కళాజాత బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.