GDWL: జిల్లాలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్రైవ్ అలైవ్ రహదారి భద్రతా వారోత్సవాలను సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌కు వచ్చే అధికారులు, సిబ్బంది ద్విచక్ర వాహనాలపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.