BDK: అన్నపురెడ్డిపల్లి మండల తాహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన స్వర్ణను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని పలు ప్రజా సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మండల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకారం ఉంటుందని ఎమ్మార్వో తెలిపారు.