HNK: అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు హన్మకొండ నగరంలో “వాక్ ఫర్ ఈక్విటీ విజ్ఞాన యాత్ర” నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు సోమవారం తెలిపారు. సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.