KMR: గోసంరక్షణే పరమావధిగా, గోహత్యను పూర్తిగా నిషేధించాలని కోరుతూ ఈ నెల 27న దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ‘మహా యజ్ఞం’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గోమాతను కేవలం పశువుగా కాకుండా, భారతీయ సంస్కృతిలో భాగంగా భావించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.