NLG: నార్కట్పల్లి మండలం తొండలవాయిలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఇవాళ ‘ముందస్తు బడిబాట’ను ప్రారంభించారు. హాజరైన ఎంఈఓ నరసింహ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తామన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.