CTR: వేదురుకుప్పం(M)లో ఎంపీడీవో పురుషోత్తం పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు యనమలమంద, దిగువపల్లాలు గ్రామాల్లో పర్యటించి చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వ్యర్థాల నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు.