KNR: కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో పదవులు పొందిన వారంతా పార్టీ బలోపేతానికి గట్టిగా కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో పార్టీ జిల్లా కమిటీలో పదవులు దక్కించుకున్న మానకొండూరు నాయకులతో సమావేశం నిర్వహించి వారిని సత్కరించారు.