సూర్యాపేట జిల్లాలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మిస్తోంది. తొండ, చిలుకూరు, గడ్డిపల్లిలో ఒక్కో పాఠశాలకు రూ. 200 కోట్లు వెచ్చిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.