WNP: ABVP ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో అభ్యాస్ జూనియర్ కళాశాలలో ఉచిత POLYCET కోచింగ్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాలమూరు విభాగ్ సంఘటన కార్యదర్శి కాయం నవేంద్ర గారు వచ్చి తరగతులను ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ABVP సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ శిక్షణ గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశమని, కష్టపడి చదివి పాలిసెట్లో ర్యాంక్ సాధించాలన్నారు.