MNCL: జన్నారం మండల భవిష్యత్తు పర్యాటక రంగం మీదనే ఆధారపడి ఉంది. కవ్వాల్ అభయారణ్యంలో జన్నారం కీలక పాత్ర పోషిస్తుంది. అభయారణ్యం ఉండటంతో పరిశ్రమల స్థాపనకు, చిన్న పరిశ్రమలు పెట్టాలన్న, అభివృద్ధి పనులు చేపట్టాలన్న అటవీ ఆంక్షలు అడ్డుగా వస్తున్నాయి. అభయారణ్యంలో ఉండే ప్రకృతి రమణీయ ప్రాంతాలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే మౌలిక సౌకర్యాలు రావడానికి అవకాశం ఉంది.