NLG: జిల్లాలో సోమవారం ఓపెన్ స్కూల్ ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ తెలుగు పరీక్షకు 10 కేంద్రాల్లో 1759 మందికి గాను 1512 మంది హాజరుకాగా, 247 మంది గైర్హాజరయ్యారు. అరబిక్ పరీక్షకు 14 మందికి 13 మంది హాజరయ్యారు. పదవ తరగతి తెలుగు పరీక్షకు 8 కేంద్రాల్లో 1334 మందికి గాను 1141 మంది హాజరుకాగా, 193 మంది గైర్హాజరయ్యారని వివరించారు.