WGL: ఖానాపురం(మం) అయోధ్యనగర్లో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌడ సంఘ అభివృద్ధికి తాను ప్రత్యేక కృషి చేస్తానని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.