HNK: నగరంలో ఇసుక అక్రమ డంపులపై సుబేదారి CI రంజిత్ కుమార్ కఠిన హెచ్చరిక జారీ చేశారు. లైసెన్సులు లేకుండా డంపులు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మైనింగ్ యాక్ట్ సహా ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అన్ని డంపుల యజమానులు నిబంధనలు పాటించాలని సూచించారు.