SRCL: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రముఖ యోగ గురువు భూపతి అన్నారు. వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో గురువారం యోగపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి మాట్లాడుతూ.. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అన్నారు. ధ్యానం అన్నది ఏ వయసు వారైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చునని తెలిపారు. ధ్యానం వలన ఏకాగ్రత పెంపొందుతుందన్నారు.